వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు ఆకాశంలో అద్భుతం, 100 నిమిషాల పాటు చంద్రగ్రహణం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

lunar Eclipse
ఈ శతాబ్దంలోనే అరుదైన అద్భుతం బుధవారం రాత్రి ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. 100 నిమిషాల సుదీర్ఘ, అత్యంత దట్టమైన, సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సంపూర్ణ గ్రహణం భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12.52కు మొదలై, 2.32కు ముగుస్తుంది. పాక్షిక గ్రహణం రాత్రి 11.52కు మొదలై తెల్లవారు జామున 3.32కు ముగుస్తుంది. మొత్తం గ్రహణకాలం 3 గంటల 40 నిమిషాలు కొనసాగడం కూడా అసాధరణమే. సాధారణంగా చంద్రగ్రహణం సంభవించినప్పుడు జాబిల్లి తొలుత గోధుమ రంగు చక్రంలా కనిపిస్తుంది. తర్వాత నారింజరంగు బంతిలా కనిపిస్తుంది. ఈ సారి మాత్రం పూర్తిగా చీకటి ఆవరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సూర్యుడు, భూమి చంద్రుడు, ఒకే సరళరేఖ మీదకొచ్చినప్పుడు భూమి ఛాయ చంద్రుడిమీద పడి చంద్రుడు కనిపించకుండా పోవడమే చంద్ర గ్రహణం. ఈ సారి చంద్రుడు సంపూర్ణంగా భూమి ఛాయలోకి రావడం వల్ల దట్టమైన గ్రహణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ''ఇంతకంటే ఎక్కువసేపున్న గ్రహణం 2000 జులైలో సంభవించింది. మళ్లీ 2141లోనే సాక్షాత్కరిస్తుంది'' అని ఢిల్లీలోని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్‌ ఎన్‌.రత్నశ్రీ వెల్లడించారు. ఒఫియుకస్‌ నక్షత్ర మండలంలోని కొన్ని ప్రకాశవంతమైన నక్షత్రాలు కూడా కొంతసేపు కనిపించకుండా పోతాయని రత్నశ్రీ వెల్లడించారు. ఈ ఖగోళ పరిణామాన్ని ఆఫ్రికా, మధ్య ఆసియాలో సంపూర్ణంగా గమనించొచ్చు. భారత్‌లో అన్ని ప్రాంతాల్లోనూ చూడొచ్చు.

English summary
The world is going to witness a rare incident which will occur only once in a century. One of the longest and darkest lunar eclipse is going to happen in the midnight of Wednesday, Jun 15.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X