వైయస్ జగన్ అలా చేస్తే మంచిదే: ఓదార్పుపై జెసి దివాకర్ రెడ్డి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను జెసి దివాకర్ రెడ్డి సమర్థించినట్లుగా గురువారం మాట్లాడారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర నిజంగా బాధితుల కోసం అయితే అందులో తప్పు లేదన్నారు. అనంతపురం జిల్లాలో నిజంగా బాధపడ్డ వారి దగ్గరకు వెళ్లి వారి సహాయం చేయడంలో తప్పు లేదు కదా అని జగన్ ఓదార్పు యాత్రలో తప్పు లేదు కదా అని అన్నారు. దానిని తాను స్వాగతిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు అధిష్టానానికి డెడ్ లైన్ విధించడంపై కూడా ఆయన స్పందించారు.
అధిష్టానానికి రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు డెడ్ లైన్లు విధించడం సరికాదన్నారు. ప్రజాప్రతినిధులు అధిష్టానానికి సమయం ఇవ్వాలని సూచించారు. అయితే తాను తెలంగాణ విషయంలో కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరో నేత కోరారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆ దిశలో చర్యలు తీసుకోవాలన్నారు.