న్యూఢిల్లీ/హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావు గురువారం ఆల్టిమేటం జారీ చేశారు. జూన్ 30వ తేది లోగా తెలంగాణపై సోనియా స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని లేదంటే తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 15 రోజుల్లోగా స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే తాము ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. అవసరమైతే రాజీనామాలను సభాపతికి నేరుగా ఇస్తామని అన్నారు. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామన్నారు. దీక్షకు తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. గురువారం లేదా శుక్రవారం కోర్ కమిటీ సభ్యులను కలుస్తామని చెప్పారు.
కాగా తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు గురువారం అధిష్టానానికి పెట్టిన డెడ్ లైన్ గురించి తనకు తెలియదని మంత్రి గీతారెడ్డి హైదరాబాదులో అన్నారు. తెలంగాణ విషయంపై టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులం అందరం ఐక్యంగానే ఉన్నామని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసే తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీలో ఉన్న నేతలతో మాట్లాడి తాజా పరిణామాల గురించి చర్చిస్తానని అన్నారు. వరంగల్‌లో విద్యార్థులపై పోలీసుల చర్య హక్కుల ఉల్లంఘన అన్నారు. వారంలో తెలంగాణపై నిర్ణయం చెబుతామని అధిష్టానం హామీ ఇచ్చిందని చెప్పారు. కాగా తనకు పంటి నొప్పి ఉన్న కారణంగా ఢిల్లీ వెళ్లలేదని చెప్పారు.
Congress senior leader K Keshav Rao put 15 days dead line to AICC president Sonia Gandhi. He said If she will not respond on telangana t-congress is ready to resign and fast.
Story first published: Thursday, June 16, 2011, 12:47 [IST]