కేబినెట్ సమావేశానికి ఏడుగురు మంత్రుల డుమ్మా, హాజరైన బొత్స

జానారెడ్డి, శ్రీధర్ బాబు, బస్వరాజు సారయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్ రెడ్డి తదితరులు తెలంగాణ కోసం అక్కడే ఉండిపోయారు. మంత్రివర్గ సమావేశంపై ఢిల్లీలో ఉన్న మంత్రులు స్పందిస్తూ తమకు తెలంగాణ ముఖ్యమని, మంత్రివర్గ సమావేశం ముఖ్యం కాదని వారు స్పష్టం చేశారు. ఇక సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ మానస సరోవరం యాత్రలో ఉన్నారు. దీంతో ఆయన కూడా హాజరు కాలేదు.
కాగా ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు జడ్జిమెంట్, ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పి కొట్టడం వంటి విషయాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడినందున ప్రత్యేక అధికారులను గ్రామ, మండల స్థాయిలో నియమించే విషయంపై కూడా చర్చించనున్నారు. కౌలు రైతుల రక్షణకు ప్రత్యేక చట్టం తేనున్నట్టు తెలుస్తోంది.