వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై పరిష్కరించకపోతే ఆమరణ దీక్ష: సోనియాకు టి-కాంగ్రెస్ లేఖ

జూన్ నెలాఖరు వరకు అధిష్టానానికి డెడ్ లైన్ విధించి జూలై 1న రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5వ తేది వరకు అధిష్టానం స్పందించకుంటే అప్పటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా టి-కాంగ్రెసు అధిష్టానానికి డెడ్ లైన్ విధించినప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు ఆగాలని సూచించింది. ఇప్పుడు వారు మరోసారి అధిష్టానానికి డెడ్ లైన్ విధించారు. అయితే వారు తమ లేఖను సోనియాతో పాటు కోర్ కమిటీలోని అందరు సభ్యులకు రాయాలని నిర్ణయించుకున్నారు. కాగా తమకు పదవులు కాంట్రాక్టు ఉద్యోగాల్లాంటివి అని శాశ్వతం కాదని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ కోసం పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళతామని ఎంపీ రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఎలాంటి త్యాగానికై నా సిద్ధం అని చెప్పారు.