కాంగ్రెసు పార్టీపై కావాలనే జగన్ వర్గం దుష్ప్రచారం: చీఫ్ బొత్స

Botsa Satyanarayana
విశాఖపట్నం: రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి ఆదరణ తగ్గిపోతోందని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యపనారాయణ శనివారం విశాఖపట్నంలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి విలేకర్లతో మాట్లాడుతూ అన్నారు. అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం తొలిసారిగా ఆయన విశాఖ వచ్చారు. కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖ నుండి ఆయన తన సొంత జిల్లా విజయనగరం వెళుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నుండి విజయనగరం వరకు రోడ్డు నిండా పార్టీ కార్యకర్తలు మొత్తం బోత్స కటౌట్లు, పోస్టర్లతో నింపారు. విశాఖలో ఆయన మాట్లాడారు.

వైఎస్‌ మరణానంతరం సంక్షేమపథకాలన్నీ మరుగునపడ్డాయని విపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని అందులో వాస్తవం లేదని అన్నారు. సోనియాగాందీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ అన్ని సంక్షేమపథకాలను ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కష్టాల్లో ఉన్నదని కొంతమంది భ్రమపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలన్నీ సజావుగా సాగుతాయని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+