ఎమ్మెల్యేలను తిప్పుకుంటున్న నీది నైతికతనా?: జగన్‌కు పిఆర్పీ ప్రశ్న

Prajarajyam
హైదరాబాద్: ఇతర పార్టీల శాసనసభ్యులను తన వెంట తిప్పుకుంటున్న వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిది నైతికతనా అని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు సత్యానందరావు శనివారం ప్రశ్నించారు. రాజ్యాంగ బద్దంగా పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తున్న చిరంజీవిది అనైతికత, ఇతర ఎమ్మెల్యేలను తిప్పుకుంటున్న జగన్‌ది నైతికతనా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు తనకు ముఖ్యమంత్రిగా మద్దతు ఇవ్వాలని చిరంజీవి వద్దకు వచ్చినప్పుడు జగన్ నైతికత ఏమైందని ప్రశ్నించారు.

ప్రజల ఆస్తులను ఎవరు దుర్వినియోగం చేసినా తప్పే అన్నారు. ప్రభుత్వం చేసినా, ఇతర వ్యక్తుల కంపెనీలు చేసిన తప్పే అని జగన్ సాక్షిని ఉద్దేశించి అన్నారు. జగన్ సంస్థలకు ఐటి నోటీసులు ఇచ్చిందని అన్నారు. చిరంజీవి కూడా అవినీతి కుంభకోణాలపై స్పందించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+