బొత్స వర్సెస్ హర్షకుమార్: ఎంపీపై కాపు వర్గాల ఆగ్రహం!

Botsa Satyanarayana
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉండటమే కాకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కదం తొక్కుతోంది. దీనికి తోడు కాంగ్రెస్‌ అక్కడ అంతర్గత కుమ్ములాటలతో దిగజారుతోంది. వర్గ పోరులతో సతమతమవుతున్న తూర్పు కాంగ్రెస్‌లో బొత్స వ్యవహారం చిచ్చు పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పిసిసి అధ్యక్ష పదవికి బొత్స సత్తిబాబు అనర్హుడంటూ అమలాపురం పార్లమెంట్‌ సభ్యుడు హర్ష కుమార్‌ విమర్శతో రాష్ట్ర కాంగ్రెస్‌లోనే గాక తూర్పుగోదావరిని సైతం ఉలిక్కిపడేలా చేసింది. పదవి వచ్చిన రెండు రోజుల్లోనే బొత్సపై తీవ్ర స్థాయిలో హర్షకుమార్‌ తీవ్ర ఆరోపణలు చేస్తూ ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాయడం, దీనిపై కాంగ్రెస్‌లో హర్షకుమార్‌ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పోరు మొదలైంది. హర్షకుమార్ శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు.

అయితే కాంగ్రెస్‌లో ముఖ్యనాయకులంతా హర్షకుమార్‌ ప్రకటనలను ఖండిస్తూనే ఉన్నారు. కోనసీమలో రెండు గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్‌లో ఎంపి హర్షకుమార్‌ విమర్శలను మంత్రి విశ్వరూప్‌‌తో పాటు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. అసలు హర్షకుమార్‌ ప్రకటన వెనుక రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఉన్నారన్న ఆరోపణలు వారు చేశారు. బొత్సాను వేలెత్తి చూపడం ద్వారా హర్షకుమార్‌ సాధించాలనుకున్నారని నేతలు ప్రశ్ని స్తున్నారు. అసలు బొత్సను అవినీతి పరుడని విమర్శిస్తున్న హర్షకుమారే పెద్ద అవినీతిపరుడని, ఆయన పార్లమెంట్‌ పరిధిలో ఉన్న మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే రాపాక అంతే స్థాయిలో తీవ్రంగా స్పందించారు. హర్షకుమార్‌ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలను పార్టీ అధినేత్రి దృష్టికి తీసుకు వెళ్తామని ప్రకటించారు. ఇదంతా ఒక ఎత్తైతే బొత్స ఎస్సీలకు వ్యతిరేకి అని కాపుల వల్ల కాంగ్రెస్‌కు ఒరిగేదేమి లేదని హర్షకుమార్‌ వ్యాఖ్యానించడం తూర్పు కాంగ్రెస్‌లో మరింత రచ్చ అయింది.

జిల్లాకు చెందిన మాలలకు కాంగ్రెస్‌ దూరమవుతుందని హర్షకుమార్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి విశ్వరూప్‌ తీవ్రంగా ఖండించారు. దీనికి తోడు కాపు సామాజిక వర్గంపై హర్షకుమార్‌ చేసిన వ్యాఖ్య లు ముఖ్యంగా హర్షకుమార్‌కే ఎక్కువ నష్టం కలిగించే అవకాశాలున్నాయి. జిల్లాలో భారీ ఓటు బ్యాంకుగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని వేలెత్తి చూపడంతో వారి మనోభావాలను ఆయన దెబ్బతీసేలా వ్యవహరించారన్న వాదనలున్నాయి. దీని వల్ల తూర్పుగోదావరి జిల్లాలో కుల చిచ్చు రగిలే ప్రమాదం ఉంది. కాపు సామాజిక వర్గంతో హర్షకుమార్‌కి విభేదాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇంత వరకు కాపు సామాజిక వర్గంతో అంటీ అంటనట్లు వ్యవహరించే మంత్రి విశ్వరూప్‌కు ఒక్కసారిగా వారి మద్దతు లభించినట్లవుతుంది. ఇప్పటికే హర్షకుమార్‌ వ్యాఖ్యల పట్ల పలు కాపు సంఘాలు, కాపు నేతలు మండి పడుతున్నట్టుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+