తెలంగాణ కిటుకు ఇక్కడే ఉంది!: టి-కాంగ్రెసుకు కెసిఆర్ సూచన

పట్టణంలో అంతటా ప్రశాంతంగా కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తే వద్దని చెప్పే హక్కు ఎవరికి ఉందన్నారు. మేం శాంతియుతంగానే ఉన్నామని చెప్పారు. తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలకతీతంగా అందరం కలిసి సంఘటితంగా పోరాడితేనే తెలంగాణ సాధిస్తామని అన్నారు. త్వరలో తాను తెలంగాణ ఎంపీలతో సమావేశమవుతానని చెప్పారు. రాయబారాలతో తెలంగాణ రాదన్నారు. టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే వారిని అధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మాదే అన్నారు.
పైరవీలతో మాత్రం తెలంగాణ రాదని తెలుసుకోవాలన్నారు. ఇక్కడ ఉంటేనే తెలంగాణ వచ్చే మార్గముందన్నారు. త్యాగాలతో తెలంగాణ ఖచ్చితంగా వస్తుందన్నారు. అందరితో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ముందు ముందు అసహజమైన పరిణామాలు ఏర్పడితే దానికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కూడా విడిపోవాలనుకుంటే విడిపోవచ్చునని చెప్పారని గుర్తు చేశారు. కెసిఆర్ ఈ కార్యక్రమంలో గరిట తిప్పారు. అనంతరం అక్కడే ఆయన కూర్చుని అందరితో కలిసి తిన్నారు.












Click it and Unblock the Notifications