రాహుల్ గాంధీని వెనక్కి నెట్టి సల్మాన్ ఖాన్: బెస్టు ఫాదర్ కండల వీరుడే
National
oi-Srinivas G
By Srinivas
|
న్యూఢిల్లీ: కండల వీరుడు, బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని వెనక్కి నెట్టాడు. ఎందులో అనుకుంటున్నారా.. మంది తండ్రి అనిపించుకోవడంలో. ఓ సర్వేలో భారత యువతీ యువకులు చక్కటి తండ్రి అంటే సల్మాన్‌లా ఉండాలని కోరుకుంటున్నారని తేలింది. పెద్ద తల, కండలు తిరిగి దేహం, డబ్బు సాయం చేయడంలో ఉదారత వంటి గుణాలు సల్మాన్‌ను వారి మనసులో అలా నిలబెట్టాయని తేలిందని షాది.కామ్ సంస్థ అధిపతి గౌరవ్ రక్షిత్ చెప్పారు. దీంతో ఇక యాంగ్రీ యంగ్‌మ్యాన్ పాత్రలు మానేసి గౌరవప్రదమైన తండ్రి పాత్రలు వేసుకోవడం మంచిదేమోనని కొందరు భావిస్తున్నారు.
పోలైన మొత్తం ఓట్లలో సల్మాన్‌కు 39 శాతం ఓట్లు, రాహుల్ గాంధీకి 31 శాతం ఓట్లు వచ్చాయట. ఇదే సర్వేలో రణబీర్ కపూర్, యువరాజ్‌సింగ్, విరాట్ కోహ్లీలకు వరుసగా నిలిచినప్పటికీ వారికి 10శాతానికి కాస్త అటు ఇటుగా మాత్రమే వచ్చాయి. వీరి దరిదాపులకు ఎవరూ రాలేదు. అయితే పెళ్లి కాని వారికే యువత మంచి తండ్రుల ఓటు వేయడం విశేషం.