వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభకు ఎంపికై కేంద్ర మంత్రి పదవి పొందడానికి చిరంజీవి విముఖత

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: గత ప్రజారాజ్యం నేత, ప్రస్తుత కాంగ్రెసు నాయకుడు చిరంజీవి ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎంపికై కేంద్ర మంత్రి పదవి పొందడానికి విముఖత ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఆయన రాజ్యసభకు ఎంపిక కావాలని ఆశిస్తున్నారు. రాష్ట్రం నుంచి ఇప్పట్లో రాజ్యసభకు ఎన్నికలు లేకపోవడంతో చిరంజీవిని మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం భావించింది. అయితే, తాను తన సొంత రాష్ట్రం నుంచే రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నట్లు, అవసరమైతే పదవి కోసం మరింత కాలం నిరీక్షిస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

పార్టీ అధిష్టానం తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వరిస్తానని ఆయన చెబుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో తనతో పాటు కాంగ్రెసులోకి వచ్చిన ముగ్గురు శాసనసభ్యులకు చిరంజీవి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. సి. రామచంద్రయ్య, అనిల్, గంటా శ్రీనివాస రావు పేర్లను ఆయన మంత్రి పదవుల కోసం ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. కోటగిరి విద్యాధర రావు, వేదవ్యాస్ కూడా అందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదే సమయంలో ప్రజారాజ్యం నుంచి వచ్చిన ముగ్గురు నాయకులకు డిసిసి పదవులు ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లు తెలుస్తోంది. పిసిసి కార్యవర్గంలో తగిన స్థానాలను కూడా ఆయన తమ వర్గానికి ఆశిస్తున్నారు.

త్వరలో వేయబోయే సమన్వయ కమిటీలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తారని అంటున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కోసం ఆ కమిటీని వేయాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుకుంటోంది. ప్రజారాజ్యం పార్టీ విలీన సభ ముగిసిన తర్వాత చిరంజీవి కాంగ్రెసులో క్రియాశీల పాత్ర పోషిస్తారని అంటున్నారు.

English summary
Prajarajyam party president Chiranjeevi declines to be elected for Rajyasabha fron Maharastra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X