వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ గంజ్ చేరుకున్న మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్యే అవంతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kanna Laxminarayana
ఖాట్మాండ్: మౌంట్ కైలాష్ యాత్రకు వెళ్లి ట్రావెల్స్ సంస్థ నిర్లక్ష్యం వల్ల చైనా, భూటాన్ సరిహద్దు హిల్సా ప్రాంతంలో చిక్కుకు పోయిన రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ, శాసనసభ్యుడు అవంతి శ్రీనివాస్, కన్నా తనయులు, మరో తొమ్మిది మంది మంగళవారం సిమి కోట్ నుండి నేపాల్ గంజ్ చేరుకున్నారు. నేపాల్ గంజ్ నుండి వారు నేపాల్ రాజధాని ఖాట్మాండ్ చేరుకోనున్నారు. అక్కడి నుండి మన దేశానికి వారు చేరుకోనున్నారు. ఖాట్మాండ్ నుండి కోల్‌కత్తా గానీ, న్యూఢిల్లీగానీ చేరుకుంటారు. అటు నుండి హైదరాబాద్ రానున్నారు. వారు బుధవారం సాయంత్రం వరకు హైదరాబాద్ చేరుకుంటారు.

ఆరు రోజుల క్రితం మౌంట్ కైలాష్ యాత్రకు వెళ్లిన కన్నా బృందం హిల్సా ప్రాంతంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుండి సోమవారం వరకు వారు హిల్సా ప్రాంతంలోనే మైనస్ డిగ్రీల చలిలో ఉండి పోయారు. అయితే సోమవారం వారిని హిల్సా ప్రాంతం నుండి సిమి కోట్ తరలించారు.

English summary
Minister Kanna Laxmi Narayana, his two sons and Bimili MLA Avanthi Srinivas were reached Nepal Gunj today morning from Simi Cot. They will be reach Hyderabad tomorrow evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X