పెట్రో ధరల పెంపుపై మండిపడిన చంద్రబాబు, పోరాటం చేస్తామని ప్రకటన

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ముందు పెట్రో ధరల పెంపుపై మాట్లాడని ప్రభుత్వం ఎన్నికలు అయిపోగానే వడ్డింపులు ప్రారంభించందని, ఇది నీతిమాలిన చర్య అని ఆయన అన్నారు. దేశంలోని అవినీతిని కట్టడి చేయగలిగితే ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. పెట్రో ధరల పెంపు వల్ల రాష్ట్ర ప్రజలపై 30 వేల కోట్ల రూపాయల భారం పడిందని ఆయన చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై మన రాష్ట్రంలోనే అమ్మకం పన్ను తక్కువ అనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. నికర లాభాలున్నా పెట్రో ధరలు పెంచడం దారుణమని ఆయన అన్నారు. పెట్రో ధరలు మళ్లీ పెంచుతామని మంత్రి జైపాల్ రెడ్డి సంకేతాలు ఇవ్వడం దారుణమని ఆయన అన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వల్ల అన్ని సరుకులు, వస్తువుల ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు. రైతులను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని ఆయన అన్నారు.