CJI: సీజేఐకి లండన్ వర్శిటీలో బొద్దింక సెగ ? భారత్ ఆగ్రహం ..!
లండన్ విశ్వవిద్యాలయంలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ రెండు రోజుల క్రితం ఏఐ, అంతర్జాతీయ న్యాయం అనే అంశంపై ప్రసంగించేందుకు వెళ్లారు. అక్కడ ఆయనకు అనూహ్యంగా నిరసన సెగ తగిలింది. సీజేఐ ప్రసంగానికి కొందరు వ్యక్తులు అడ్డు తగిలారు. భారత్ లో సీజేఐ చేసిన బొద్దింక వ్యాఖ్యలపై ఆయన్ను నిలదీసేందుకు ప్రయత్నించారు. చివరికి నిరసనల మధ్యే సీజేఐ తన ప్రసంగం పూర్తి చేసుకుని వెనుదిరిగారు.
లండన్ వర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఒక మహిళ భారత్ (india) లో అసమ్మతిపై ప్రశ్నించారు. గతంలో సీజేఐ చేసిన బొద్దింక వ్యాఖ్యలపై మరో వ్యక్తి ప్రశ్నించారు.దీంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. సభ నిర్వాహకులు వెంటనే జోక్యం చేసుకున్నారు. అంశానికి సంబంధం లేని ప్రశ్నలు వద్దని వారు చెప్పారు. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశానికే పరిమితం కావాలని కోరారు.చివరికి నిరసనల మధ్యే ఈ కార్యక్రమం పూర్తి చేశారు.

అనంతరం ఈ ఘటనపై యూకేలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. అక్కడ జరిగిన ఘటనను తీవ్రంగా తప్పుబట్టింది. ఇటువంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ప్రజా చర్చల్లో గౌరవం ఉండాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భిన్నాభిప్రాయాలు సహజమని, కానీ అవి గౌరవప్రదంగా ఉండాలని తెలిపింది. అసలే మన దేశంలో సీజేఐ బొద్దింక వ్యాఖ్యల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఓ ఆన్ లైన్ ఉద్యమం ప్రారంభమై ఇవాళ ఢిల్లీలో ఆందోళన నిర్వహించే వరకూ వచ్చింది. ఈ నేపథ్యంలో సీజేఐ వ్యాఖ్యలపై లండన్ నిరసన చర్చనీయంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications