'రోజూ ఒక గంటసేపు చేయండి': అనసూయ వీడియో వైరల్

యాంకర్, నటి అనసూయ తన అందంతో కుర్రకారు మతి పోగెట్టేస్తున్నారు. ఏజ్ పెరుగుతున్నా తరగని అందంతో మతిపోగొడుతున్నారు. టాలీవుడ్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించారు అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. క్షణం, సోగ్గాడే చిన్ని నాయన, రంగస్థలం మూవీలో రంగమ్మత్త, పుష్ప సిరీస్ లో మంగళం శీను భార్య దాక్షాయణి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అటు మాస్, ఇటు క్లాస్ అని తేడా లేకుండా తన వైవిధ్యమైన నటనతో దూసుకెళ్తున్నారు అనసూయ. ఆమె సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న సమకాలీన రాజకీయ, సినీ అంశాలపై ఆమె తన పోస్టుల ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.

Anasuya Anchor and Tollywood actress workout video gone viral on social media anasuya latest video

అయితే తాజాగా అనసూయ తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫిట్ నెస్ వీడియో పోస్టు చేశారు. అది కాస్తా క్షణాల్లోనే వైరల్ అయింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ' ప్రతిరోజూ ఉదయం నిద్రలేవడం, వర్క్ అవుట్స్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఈ రోజు ఏం చేస్తాం.. రేపు చూద్దాం లే అని బద్దకిస్తూ ఉంటాం. కానీ వర్క్ అవుట్స్ అలవాటు చేయడం నేర్చుకోండి. ఒక్కసారి అలవాటు చేసుకుంటే అసలు ఆపలేరు. అందమైన శరీరం కోసం ఓ గంట పాటు సమయం కేటాయించండి.. కుదిరితే గంటన్నర కేటాయించండి అని తెలిపారు. ఈ వీడియోలో ఆమె పెల్విక్ ఏరియా, ఇన్నర్ థైస్ కోసం చేసే స్పెషల్ వర్క్ అవుట్స్ గురించి వివరించారు.

వర్క్ అవుట్ తర్వాత తన హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ను చూపించారు అనసూయ. మెంతి నీళ్లు, నానబెట్టిన నట్స్, బ్లూ బెర్రీస్, వాల్ నట్స్ తో పాటు స్పినాచ్ అండ్ మష్రూమ్ ఆమ్లెట్ తిన్నారు. ఒకప్పుడు ఫుల్ గా తినే అలవాటు ఉండేదని.. ఇప్పుడు నా ఆరోగ్యం నా చేతుల్లోనే ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్స్ పెడుతున్నారు. అనసూయను ప్రశంసిస్తున్నారు. ఇక ప్రస్తుతం అనసూయ ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+