బండి, ఈటెల సయోధ్య పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ బీజేపీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాల పైన స్పందించారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ సమక్షంలో ఈటల - బండి సంజయ్ సయోధ్య పైన ప్రశ్నలు లేవెనెత్తారు. గ్రేటర్ పరిధిలోని మూడు కార్పోరేషన్లలో బీజేపీ గెలుస్తుందా అని ప్రశ్నించారు. ఒక్క కార్పోరేషన్ లో సగం సీట్లయినా గెలుస్తుందా అని సందేహం వ్యక్తం చేసిన రాజాసింగ్.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పైన ఆసక్తి కర విశ్లేషణ చేసారు.

తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం కోసం పార్టీ నాయకత్వం నేరుగా రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సమక్షంలో బీజేపీ నేతలు ఎంపీ ఈటల రాజేందర్, కేంద్రమంత్రి బండి సంజయ్ ల సయోధ్య కుదిరింది. ఇద్దరూ గతం మరిచి పార్టీ కోసం పని చేస్తారని ప్రకటన చేసారు. ఈ పరిణామం పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరు కలవడం పార్టీ పరంగా మంచి పరిణామమేనని పేర్కొన్న ఆయన, అంత మాత్రాన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా? అంటూ కొత్త చర్చ లేవనెత్తారు. పార్టీలో కొందరు నేతలు కలివటం వలన అధికారం రాదని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయి పరిస్థితులు.. కేడర్ అభిప్రాయాల తో పాటుగా ప్రజల పక్షాన నిలబడితేనే ప్రయోజనం ఉంటుందని చెప్పుకొచ్చారు.

శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్, దర్శనంలో కీలక మార్పులు..!!
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్, దర్శనంలో కీలక మార్పులు..!!
mla-rajasingh-reacts-over-bandi-sanjay-etala-rajender-compramise-in-the-bjp-here-the-details

బీజేపీ పరిస్థితి పై విశ్లేషణ

త్వరలో గ్రేటర్ పరిధిలో ఎన్నికలు జరగనుండటంతో రాజాసింగ్ ప్రస్తుత పరిస్థితి పైనా స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం పార్టీ ఎంత బలంగా ఉందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోకుండా కేవలం భేటీలకే పరిమితమైతే లాభం లేదని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో జరిగే మూడు కార్పోరేషన్ల మేయర్ పదవులు గెలుస్తామ ని పార్టీ నేతలు చెబుతున్నారని.. మూడు కాదు, ముందు ఒక్కటైనా గెలిచి చూపించండి అంటూ సవాల్ చేసారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను గ్రహించి, అతివిశ్వాసానికి పోకుండా పార్టీని బలో పేతం చేయడంపై దృష్టి పెట్టాలని రాజాసింగ్ సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావు చేతులు కట్టేసి.. ఆయనను పని చేయటమంటే ఎలా చేస్తారని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+