కాటసాని రాంరెడ్డికి అందుకే ప్రాధాన్యం ఇస్తున్నాం: కిరణ్ కుమార్ రెడ్డి

విద్యావంతులకు సంవత్సరానికి 3 లక్షల చొప్పున మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలను ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన శనివారం బనగానపల్లెలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. 20 లక్షలమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 3,500 కోట్ల రూపాయలు, ఓసీలకు 390 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు మంజూరు చేశామన్నారు. విద్యాపక్షోత్సవాల్లో భాగంగా చదువుపై 2500 కోట్ల రూపాయలు వ్యయం చేశామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యాబోధన ఉంటుందన్న నమ్మకాన్ని తాము కలిగిస్తామన్నారు.












Click it and Unblock the Notifications