జగన్‌ను ఢీకొనెందుకు రంగంలోకి కెవిపి, రాష్ట్రంలో ముఖ్య పదవి!

దీనికి కెవిపి కూడా అంగీకరిచినట్లుగా సమాచారం. అమ్మ అభయంతో కెవిపికి ఉన్నత పదవి వస్తుందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కెవిపి అనుచరుల్లో ఉత్సాహం పొంగుకొస్తుందంట. కెవిపి కూడా జగన్‌ను రాజకీయంగా ఢీకొనేందుకు అధిష్టానం ముందు సిద్ధమని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బొత్స పిసిసి అధ్యక్షుడిగా నియమించబడిన తర్వాత జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధమయిన పలువురు శాసనసభ్యులు, ముఖ్య నేతలు మళ్లీ కాంగ్రెసు బాట పట్టారు. కెవిపికి ముఖ్యమైన పదవిని అప్పగించి ఆయన తన పాత్ర పోషిస్తే జగన్‌కు గడ్డుకాలం వస్తుందని పలువురు భావిస్తున్నారు. వైయస్ హయాంలో కెవిపి తెర వెనుక ఉన్నప్పటికీ అంతా ఆయన కనుసన్నుల్లోనే నడిచేదనే వాదనలు ఉన్నాయి.
ఇటీవలె సోనియాగాంధీని కలిసిన కెవిపి అమ్మ నుండి ఆశీర్వాదం పొందినట్టు తెలుస్తోంది. ఆయన ఇటీవల కొన్ని రోజులు న్యూఢిల్లీలోనే తిష్ట వేశారు. ఓ సమయంలో ఆయనకు పిసిసి పదవి వస్తుందనే వాదనలు కూడా వినిపించాయి. ఆదివారం కెవిపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయనకు ఇవ్వాల్సిన పదవిపైతో పాటు రాష్ట్ర కాంగ్రెసు పరిస్థితిపై కూడా చర్చించినట్లుగా పలువురు భావిస్తున్నారు.