సుష్మా స్వరాజ్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, బిజెపి పాగా

సుష్మా స్వరాజ్‌ను ముందు పెట్టి తెలంగాణలో బలం పెంచుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు అనుకుంటున్నారు. కరీంనగర్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ సభలో సుష్మా స్వరాజ్ ప్రసంగించారు. దీనికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. తెలంగాణలో సుష్మా స్వరాజ్‌కు ఇమేజ్ ఉందని బిజెపి రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. దాన్ని వాడుకోవాలనేది వారి ఎత్తుగడగా కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు బిజెపి కూడా తెలంగాణ రాజకీయ జెఎసిలో ఉంది. జెఎసి ఇచ్చిన కార్యక్రమాల్లో ఆ పార్టీ పాల్గొంటోంది. భవిష్యత్తులో కూడా అలా కలిసి పనిచేయాలనేదే బిజెపి ఆలోచనగా చెబుతున్నారు.