తన చేతినే కాల్చుకుని తిన్న వృద్ధుడు, ఒళ్లు గగుర్పొడిచే సంఘటన

ఆనోటా ఈనోటా విషయం తెలిసిన పట్టణవాసులు పెద్దఎత్తున అక్కడ గుమిగూడారు. అయితే అప్పటికే అతడు అరడుగు పొడవునా చేతిని తినేశాడు. అంతకుముందు ఉదయాన్నే బ్లేడుతో చేతి వేళ్లను కోసుకుని వాటిని సూర్యమహల్ థియేటర్ ఎదురుగా పేపర్లతో కాల్చుకుని తన వెంట తీసుకువెళ్లినట్లు కొందరు చెప్పారు. పదిగంటల తర్వాత సిమెంటు తూరలో కూర్చుని చేతిని ఆరగిస్తున్న విషయాన్ని స్థానికులు గమనించారు. అతడి ఒళ్లంతా రక్తం కారిపోగా, మాట్లాడుతున్న భాష ఏమిటో అర్థం కాలేదు. సమాచారం పోలీసులకు తెలియడంతో బాధితుడిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.