18 కిలోమీటర్లు మంత్రి నిమ్మల సైకిల్ డబుల్ రైడ్!
సైకిల్ తొక్కటం అంటే ఒకప్పుడు సరదా.. డబుల్స్ ఎక్కించుకుని తొక్కితే ఇంకా ఆ మజాయే వేరు. సైకిల్ పెడల్ మీద అందీ అందని కాళ్ళతో అప్పట్లో సైకిళ్ళు తొక్కిన రోజులు చాలామందికి జ్ఞాపకం ఉండే ఉండాలి. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఇటీవల ఏపీలో ఇంధన పొదుపు కోసం నో వెహికల్ డే ను నిర్వహిస్తూ ప్రజా ప్రతినిధులు, మంత్రులు సైకిళ్ళు తొక్కుతూ కార్యాలయాలకు వెళ్తున్నారు.
సైకిల్ డబుల్ రైడ్ చేసిన మంత్రి నిమ్మల, పల్లా
తాజాగా ఇంధన పొదుపు చర్యలలో భాగంగా నో వెహికల్ డే సందేశాన్ని చాటుతూ మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సైకిల్ మీద డబుల్ రైడ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. పొదుపుచర్యలు అందరూ పాటించాలని తమ ప్రయాణం ద్వారా అర్ధం అయ్యేలా చెప్పారు. 'నో వెహికల్ డే' సందేశం అందరికీ తెలిసేలా వీరి ప్రయాణం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వరకూ సాగింది.

విజయవాడ నుండి మంగళగిరి వరకు మంత్రి డబుల్ సైకిల్ రైడ్
ముందుగా పాలకొల్లు నుంచి రైలులో ప్రయాణికులతో కలిసి సాధారణ వ్యక్తిలా మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ వరకు ప్రయాణం చేశారు. ఆపై రామవరప్పాడు నుంచి మంగళగిరి వరకు సైకిల్ తొక్కారు. మార్గ మధ్యలో తాడేపల్లి వద్ద తోడుగా చేరిన పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఒకే సైకిల్‌పై డబుల్ రైడ్ చేస్తూ మంత్రి నిమ్మల ముందుకు కదిలారు. మధ్యలో కాసేపు ఆగి నిమ్మ సోడా తాగారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
18 కిలోమీటర్లు మేర సైకిల్ తొక్కిన మంత్రి నిమ్మల
రెండో వారం నో వెహికల్ డే సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు 18 కిలోమీటర్లు మేర సైకిల్ ప్రయాణం చేశారు. రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వరకు ఆయన సైకిల్ తొక్కారు. దాదాపు 18 కిలోమీటర్లు మేర సైకిల్ తొక్కటం అంటే మామూలు విషయం కాదు. తాడేపల్లి వద్ద మంత్రి నిమ్మలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్వాగతం పలికారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి డబుల్ రైడ్
అక్కడ నుండి ఇద్దరూ ఒకే సైకిల్ పై పార్టీ కార్యాలయానికి డబుల్ రైడ్ చేశారు. వరుసగా రెండో వారం నో వెహికిల్ డే సందర్భంగా నిమ్మల మళ్లీ సైకిల్ తొక్కడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సందర్బంగా టీడీపీ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ మంత్రి నిమ్మల సైకిల్ ప్రయాణం మాలో ఎంతో స్ఫూర్తి నింపిందని కొనియాడారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సైకిల్ తొక్కినట్లు ఇరువురు నేతలు తెలిపారు.













Click it and Unblock the Notifications