న్యూఢిల్లీ: తాను బలహీనుడ్ని కానని, తమ వ్యూహంలో భాగంగానే ప్రతిపక్షాలు అలాంటి ప్రచారం సాగిస్తున్నాయని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రింట్ మీడియాకు చెందిన ఐదుగురు సంపాదకులతో ఆయన బుధవారం సమావేశయ్యారు. తనకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా మద్దతు సంపూర్ణంగా ఉందని ఆయన చెప్పారు. కాంగ్రెసు అధ్యక్షురాలిగా సోనియా పనితీరు అద్భుతమని ఆయన కొనియాడారు. త్వరలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, తేదీలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య అంతరాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
అన్నా హజారే, బాబా రామ్‌దేవ్‌లపై తనకు గౌరవం ఉందని, ప్రధానిని లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి తేవడానికి తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. ప్రతిపక్షం సహకరించకపోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. మీడియా తీరును ప్రధాని తప్పు పట్టారు. మీడియా ఆరోపణదారుగా, ప్రాసిక్యూటర్‌గా, జడ్జిగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తన ప్రతిష్టను పెంచుకునే వ్యూహంలో భాగంగా ప్రధాని సంపాదుకులతో సమావేశం ఏర్పాటు చేశారు.
The Prime Minister has finished meeting with five editors of different print publications as part of what's seen as an image makeover that will have him interacting more frequently- though off-camera- with the media.
Story first published: Wednesday, June 29, 2011, 13:06 [IST]