కెసిఆర్! సమాధానం చెప్పు: టిడిపి నేత కడియం

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో టిఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు భేటీ వెనుక ఆంతర్యమేమిటన్నారు. సమైక్యాంధ్ర నేతలు బొత్స, రఘువీరారెడ్డి, పురంధేశ్వరి తెలంగాణలలో పర్యటించినప్పుడు టిఆర్ఎస్ ఎందుకు అడ్డుకోలేదని కడియం ప్రశ్నించారు. కాగా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రలో పరిపాలన పూర్తిగా స్తంభించిందని మరో నేత దేవేందర్ గౌడ్ వేరుగా అన్నారు. తెలుగుదేశం పార్టీని బలహీనపర్చే ఉద్దేశ్యంతో అధికార కాంగ్రెసు మరో 50 గ్రామాలను గ్రేటర్ హైదరాబాదులో కలపాలని చూస్తుందన్నారు.












Click it and Unblock the Notifications