సీమాంధ్రులతో కలిసి ఉండలేం: హరీష్ రావు

కాంగ్రెసు ప్రజాప్రతినిధుల రాజీనామాల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ జెఎసి ఆదేశిస్తే తాము కూడా రాజీనామాలు చేస్తామని ఆయన అన్నారు. రాజీనామాలు చేసే ప్రజాప్రతినిధులపై తాము పోటీకి అభ్యర్థులను దించబోమని, వారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణపై తెలంగాణ నాయకుల మధ్య ఏకాభిప్రాయం ఉందని, ఇతరుల అభిప్రాయం అవసరం లేదని ఆయన అన్నారు.
తెలంగాణపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. తెలంగాణ సమస్యను దేశసమగ్రతో ముడిపెట్టవద్దని ఆయన అన్నారు.