రాజీనామాకు జైపాల్‌రెడ్డిపై టి- ఎంపిల ఒత్తిడి, డైలమా

కాగా, అమెరికాలో ఉన్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అక్కడి నుంచే ఫాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపుతున్నట్లు తెలిపారు. అది పనికి రాకపోతే అమెరికా నుంచి వచ్చిన తర్వాత రాజీనామా చేస్తానని చెప్పారు. సోమవారం 11 గంటలకు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తమ రాజీనామా లేఖలను సమర్పించనున్నారు. తాము రాజీనామాలకే కట్టుబడి ఉన్నామని, వెనక్కి తగ్గేది లేదని వారు ఢిల్లీకి వచ్చిన తర్వాత మరోసారి స్పష్టం చేశారు. తమకు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేసి, ప్రక్రియను ప్రారంభిస్తే తాము వెనక్కి తగ్గుతామని వారు చెప్పారు. పార్టీ అధిష్టానం పెద్దలు రేపు ఉదయం తమతో మాట్లాడవచ్చునని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప తమకు ప్రత్యామ్నాయాలు అవసరం లేదని వారు కచ్చితంగా చెబుతున్నారు.
తాము రాజీనామాలు చేస్తున్న విషయాన్ని జైపాల్ రెడ్డికి చెప్పామని, జైపాల్ రెడ్డి తమ నిర్ణయాన్ని సమర్థించారని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తమ పోరాటానికి మద్దతివ్వాలని తాము జైపాల్ రెడ్డిని కోరినట్లు ఆయన తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు తెలంగాణ పార్లమెంటు సభ్యులు జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. స్పీకర్‌ను స్వయంగా కలిసి రాజీనామాలు సమర్పిస్తామని ఆయన జైపాల్ రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం మీడియా ప్రతినిదులతో చెప్పారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications