ఎంపీల రాజీనామా వాయిదా: స్పీకర్ ఆఫీసులోనే నిరీక్షణ

ఎంపీలు మధు యాష్కీ, బలరామ్ నాయక్ ఫ్యాక్స్ ద్వారా రాజీనామాలు పంపిస్తారని చెప్పారు. కాగా అధిష్టానంతో చర్చలకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే తెలంగాణ ఇస్తామనే ఒకే ఒక డిమాండ్‌తో తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. తమ అంతిమ లక్ష్యం తెలంగాణే అని చెప్పారు. రాజీనామాలపై ఎలాంటి రెండో ఆలోచన లేదన్నారు. స్పీకర్ వచ్చే వరకు ఇక్కడే ఉంటామని చెప్పారు. కాగా హైదరాబాదులో మంత్రి జానారెడ్డి మంత్రుల రాజీనామా పత్రాలను డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కకు సమర్పించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా సైతం అందులో ఉన్నట్టుగా సమాచారం. రాజీనామాలు సమర్పించడానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యులు నామా నాగేశ్వర రావు, రమేష్ రాథోడ్ ఢిల్లీకి బయలుదేరారు.












Click it and Unblock the Notifications