వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతిపై యుద్దంలో అన్నాహజారే బృందానికే ఓటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anna Hazare-Sonia Gandhi
న్యూఢిల్లీ: దేశంలోని అవినీతిని ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం కన్నా ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారేనే ముందున్నారంట. ఓ సర్వేలో ఈ విషయం తేలింది. ఐబిఎన్‌ - హిందుస్థాన్‌ టైమ్స్‌ సంయుక్తంగా చేపట్టిన అభిప్రాయ సేకరణలో ప్రభుత్వం కన్నా అన్నా హజారే బృందం ఎక్కువ స్ఫూర్తినిచ్చిందని తేలింది. అవినీతికి వ్యతిరేకంగా వారు మంచి నమ్మకం కలిగిస్తున్నారని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. హజారేకు మద్దతిస్తున్నవారిలో ఎక్కువ మంది ముంబయి నుండి ఉండటం విశేషం.

ఇక అన్నా హజారే బాటలోనే పయనించి నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటించక పోవడం మరో విశేషం. చాలామంది ప్రధానిని కూడా లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థను కూడా ఎక్కువ వరకు లోక్‌పాల్‌ పరిధిలోకి తేవాలన్నారు. గత ఆరు నెలల కాలంలో అవినీతి బాగా పెరిగిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అన్నా తరహా పౌర ఉద్యమాలు అవినీతిని కాద్దిగానైనా అరికడతాయని చాలామంది అభిప్రాయపడ్డారు.

English summary
IBN - Hindustan Times poll revealed that Anna Hazare team is best to central government on fight against corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X