ప్రణబ్‌తో భేటీ: తెలంగాణ నేతలు అటు, లగడపాటి ఇటు

కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు దిగి రావడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడానికి నిర్దిష్టమైన గడువు ఇవ్వాలని తెలంగాణ నేతలు చెబుతున్నారు. మంగళవారం అర్థరాత్రి వరకు అధిష్టానం పెద్దలతో జరిగాయి. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు కె. జానా రెడ్డి, సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు మంగళవారం రాత్రి సుదీర్ఘంగా చర్చించారు. రాత్రి 11 గంటలకు అహ్మద్ పటేల్‌తో జరగాల్సిన సమావేశం రద్దయింది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరం గురించి తాము ప్రణభ్‌కు చెప్పామని, పరిస్థితిని వివరించామని, తాను ఇతర అధిష్టానం పెద్దలతో పరిస్థితిని వివరిస్తామని ప్రణభ్ అన్నారని సమావేశానంతరం మంత్రి కె. జానా రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రణబ్ నుంచి వారికి ఆశాజనకమైన సమాచారం అందలేదని అర్థమవుతోంది. జానా రెడ్డి మాత్రమే రెండు మూడు మాటలు చెప్పేసి మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. మిగతా నాయకులు కూడా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఎప్పుడు సంప్రదింపులు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారని తెలంగాణ నేతలు అధిష్టానం పెద్దలను అడుగుతున్నారు. దానికి వారికి అధిష్టానం పెద్దల నుంచి సరైన సమాధానం రావడం లేదు.
తెలంగాణ విషయంపై కాంగ్రెసు అధిష్టానం పక్కాగా యు- టర్న్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. గులాం నబీ ఆజాద్ వంటి నేతలు చెబుతున్న విషయాలు ఆ విషయాన్నే తెలియజేస్తున్నాయి. సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది, ఏకాభిప్రాయ సాధన వంటి మాటల ద్వారా వ్యవహారాన్ని కాంగ్రెసు అధిష్టానం మళ్లీ మొదటికి తెచ్చింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications