పట్టువీడని టి-కాంగ్రెసు నేతలు: దిగిరాని అధిష్టానం

తెలంగాణపై హామీ ఇవ్వడం, నిర్ధిష్ట సమయం కాకుండా కేవలం తాము చర్చలకు సుముఖంగా ఉన్నామనే సంకేతాల్ని అధిష్టానం టి-కాంగ్రెసుకు ఇచ్చినది. దీంతో చేసేది లేక టి-ఎంపీలు బుధవారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఇప్పటికే అధిష్టానం రాష్ట్రంలోని అన్ని పార్టీలతో చర్చలు జరిపింది. తెలంగాణ కోసం శ్రీకృష్ణ కమిటీని వేసింది. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించబడింది, అఖిలపక్షం సమావేశాలు కూడా అయిపోయాయి. అయినప్పటికీ అధిష్టానం మళ్లీ చర్చల పేరుతో తెలంగాణ అంశాన్ని మొదటకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోందని టి-కాంగ్రెసు నేతలు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఎంపీలు వెనక్కి తిరిగి వస్తున్నట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో తెలంగాణ కోసం ఒక్కో పార్టీ నుండి అధ్యక్షుడిని పిలవాలని బిజెపి, టిఆర్ఎస్ వంటి పార్టీలు చేస్తున్న డిమాండును కూడా కాంగ్రెసు అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఒక్కో పార్టీ నుండి ఒక్కొక్కరిని పిలిస్తే అన్ని పార్టీల నిర్ణయం తెలుస్తుందని టిఆర్ఎస్, బిజెపి పార్టీల అభిప్రాయం. తెలంగాణపై ఇప్పుడు అస్పష్టత ఉన్నది తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు మాత్రమే. అయితే టి-కాంగ్రెసు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి అధిష్టానంతో చర్చలకు వెళ్లినప్పటికీ అధిష్టానం వారికి స్పష్టమైన హామీ రాకపోవడం వారిలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఇక వారు హైదరాబాదు వచ్చి తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. వారు తమ పదవులకు రాజీనామా చేసి పార్టీకి చేయలేదు. కాబట్టి వారు తమ ఉద్యమాలతో పార్టీపై ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications