కళానిధి మారన్‌పై స్వామి నిత్యానంద ఫిర్యాదు

సన్ నెట్‌వర్క్ ప్రసారం చేసిన టీవీ ఫుటేజ్‌లు తమ ఆశ్రమం ప్రతిష్టను దెబ్బ తీసిందని ధ్యానపీఠానికి చెందిన నిత్యశర్వానంద చెప్పారు. దాని వల్లనే సంస్థ యజమాని కళానిధి మారన్‌పై, సిఒఒ హన్సరాజ్ సక్సేనాపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కళానిధి మారన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన దయానిధి మారన్ సోదరుడు. ఆ ఫుటేజ్‌ని ప్రసారం చేయడం కుట్ర అని పీఠం అంటోంది. సేలం డిస్ట్రిబ్యూటర్ ఒకరు చేసిన ఫిర్యాదుతో ఇప్పటికే సక్సేనా చీటింగ్ కేసులో పోలీసు కస్టడీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications