వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి పాలన వస్తుందనుకోవడం లేదు: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

K Rosaiah
హైదరాబాద్‌: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని తాను భావించడంలేదని మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. తెలంగాణ విషయంలో కేంద్రప్రభుత్వం సరిగా స్పందించడం లేదని కొందరు చేస్తున్న వాదనల్లో నిజం లేదని అన్నారు. హైదరాబాద్ నగరంలోని హైటెక్స్‌ ఎగ్గిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అంశం జఠిలమైనదని, ఒకటి రెండురోజుల్లో తేలే విషయం కాదని అన్నారు. ఒక సమస్యకు వంద శాతం పరిష్కారం కనుగొనలేమని అభిప్రాయపడ్డారు.

విద్యార్థులు ఆవేశంతో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని మంత్రి శైలజానాథ్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తామంతా ప్రయత్నిస్తున్నామని విద్యార్థులు ఆందోళనలకు దిగి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన కోరారు. జెఎసి చెప్పగానే తామంతా రాజీనామాలు చేయాలా అని సీనియర్‌ నేత పాలడుగు వెంకట్రావు ప్రశ్నించారు.

English summary
former CM Rosaiag said that there is no possibility of president rule in Andhrapradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X