ఘోర రైలు ప్రమాదంలో 53 మంది దుర్మరణం

అత్యంత వేగంగా దూసుకెళ్తున్న రైలు ఇంజన్‌తో పాటు 10 - 15 బోగీలు పట్టాలు తప్పాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి అలహాబాద్, కాన్పూర్‌ల నుంచి రెండు మెడికల్ వ్యానులను పంపించారు. అక్కడ ఉండిపోయిన ప్రయాణికులను తరలించడానికి మరో రైలును పంపించారు. రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ప్రయాణికులను బయటకు తీయడానికి గ్యాస్ కట్టర్లు వాడుతున్నారు. గాయపడినవారిని ఫతేపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు.
డ్రైవర్ అత్యవసరమైన బ్రేకులను వేయడం వల్లనే రైలు పట్టాలు తప్పిందని అనుమానిస్తున్నారు. అయితే, అతను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనేది తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంతో రద్దీగా ఉండే హౌరా - ఢిల్లీ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఏడాదిలో ఇదే అత్యంత పెద్ద రైలు ప్రమాదం.












Click it and Unblock the Notifications