రాజీనామాకు అప్పుడు నో ఇప్పుడు యస్ ఎందుకు?

ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి ఉన్నందున బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ వంటి పార్టీలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి మొదట చెప్పినప్పటికీ టిడిపి, కాంగ్రెసు, టిఆర్ఎస్, సిపిఐలు రాజీనామా చేయడంతో బిజెపి సైతం రాజీనామా చేసింది. అయితే అప్పుడు రాజీనామా చేయక, ఇప్పుడు చేయడం వెనుక కారణం రాజ్యాంగ సంక్షోభం అని అర్థం అవుతుంది. 2010లో రాజీనామా చేయడం వల్ల కేవలం ఉప ఎన్నికలకు మాత్రమే వెళ్లవలసి ఉంటుంది. దాంతో ఫలితం ఉండదు. కానీ ఈసారి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారందరూ పార్టీలకతీతంగా రాజీనామాలు చేసిందున రాజ్యాంగ సంక్షోభం కోసమే రాజీనామాకు కిషన్ రెడ్డి సై అన్నట్లుగా పలువురు భావిస్తున్నారు. అయితే 2010లో లక్ష్మీ నారాయణ రాజీనామా వ్యక్తిగతమే కాకుండా స్థానిక ప్రాధాన్యం కూడా అని పలువురు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications