రాజీనామాలపై వెనక్కి తగ్గితే రాళ్లతో కొట్టండి: దామోదర్

R Damodar Reddy
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంతం సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి గురువారం సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము చేసిన రాజీనామాలను వెనక్కి తీసుకుంటే తమను రాళ్లతో కొట్టాలని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ పార్టీ అధిష్టానాన్ని ఢీకొంటామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేంత వరకు రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. రాజీనామాలు చేయనివారు వెంటనే రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో ఆయన గురువారం మాట్లాడారు.

తెలంగాణ కోసం తాము ఏ త్యాగాలకైనా సిద్ధమని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే సరిహద్దుల్లో గోడలు కడుతామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకుంటే ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుందని, గ్రామాల్లో తిరగనివ్వబోమని ఆయన అన్నారు. కోటి మందితో హైదరాబాదును దిగ్భంధిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనూ పోరాడామని పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు అన్నారు. తెలంగాణ ఇవ్వండి లేదా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పోరాటం చేయడానికి అనుమతి ఇవ్వాలని తాము పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఇస్తామని చెప్పి తెరాసతో 2004లో తెరాసతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వలేకపోయామని ఆయన అన్నారు. కాగా, దీక్ష చేస్తున్న శానసభ్యుడు చెరకు ముత్యంరెడ్డి స్పృహ తప్పి పడిపోయారు. దాంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+