రాజీనామాలపై మీరాకుమార్ దారిలో మనోహర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 13 మంది తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యులు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలపై ఆగస్టు 1వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటానని మీరా కుమార్ ఇటీవల చెప్పారు. లోకసభ సభ్యుల రాజీనామాలపై మీరా కుమార్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూసి, ఆమె అనుసరించిన విధానాన్నే శాసనసభ్యుల రాజీనామాల విషయంలో అనుసరించాలని మనోహర్ అనుకుంటున్నారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రాజీనామాలు చేసిన సమయంలో మనోహర్ స్థానికంగా లేరు. ఆయన అమెరికాలో ఉన్నారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు తమ రాజీనామా లేఖలను డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్కకు అందించారు. దీన్నిబట్టి శాసనసభ్యుల రాజీనామాలపై ఈ నెలాఖరు వరకు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications