లాస్ ఏంజెలిస్: జెన్నిఫర్‌లోపెజ్, ఆమె భర్త మార్క్ ఆంటోనీలు త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని వారిద్దరూ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంటకు ఇద్దరు కవలపిల్లలు. పైకి అంతా సవ్యంగానే కనిపిస్తున్నా వీరిద్దరూ విడాకులకు సిద్ధపడటం విచిత్రం. తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టేసి ఎవరికి వారుగా గడపాలనుకుంటున్నట్లు ఈ జంట తెలిపింది. విడాకుల నిర్ణయం తీసుకోవడం అంత సులువేమీ కాదు. అత్యంత బాధాకరమైన విషయం.
మాకుటుంబంతో ముడిపడి ఉన్న ప్రతిఒక్కరికీ ఇది ఆవేదన కలిగించే అంశం. అయినప్పటికీ మా వ్యక్తిగత జీవితానికి విలువనిచ్చి గౌరవిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు అని లోపెజ్, ఆంటోనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే వారిద్దరూ కలిసి నిర్వహించదలచుకున్న ఒక టెలివిజన్ కార్యక్రమం పరిస్థితి ఇప్పుడు గందరగోళంలో పడింది.