లగడపాటి అందుకే ఇప్పుడు జగన్‌ని టార్గెట్ చేశాడా?

ఇన్నాళ్లు మాట్లాడని లగడపాటి జగన్ ఆస్తులపై సిపిఐ దర్యాఫ్తుకు ఆదేశించిన ఈ సమయంలోనే మాట్లాడటం ఎందుకని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలా కాకా పోయినప్పటికీ శంకర్ రావు వంటి మంత్రులు జగన్‌పై విరుచుకు పడిన తర్వాత మంత్రి పదవులు దక్కాయి. ఇటీవల జరిగిన కేంద్ర విస్తరణలో రాష్ట్రానికి ఒక ప్లస్ మరో మైనస్ తప్పితే ఒరిగిందేమీ లేదు. లగడపాటి సైతం ఆ వ్యూహంతో వెళుతున్నారని అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జగన్ బయటకు వెళ్లిన తర్వాత సీమాంధ్రలో ఇప్పటి వరకు జగన్‌ను ధీటుగా ఎదుర్కొనే నేత లేరు. జగన్‌ను ఎదుర్కొనే నేతగా ఎదగడానికి పలువురు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్‌ను ఎదుర్కొనే వ్యూహంలో విఫలమయ్యాడన్న వార్తల నేపథ్యంలో బొత్స సత్తిబాబు పిసిసి పీఠం ఎక్కారు. సత్తిబాబు వచ్చిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగ్గానే కనిపిస్తోంది. మరికొందరు సైతం అడపా దడపా జగన్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. లగడపాటి సైతం సీమాంధ్రలో జగన్‌ను ఎదుర్కొనే నేతగా ఎదగడానికి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. లగడపాటి వ్యాఖ్యలను మంత్రి డొక్కా తదితరులు కూడా సమర్థిస్తున్నారు.












Click it and Unblock the Notifications