చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామోజీరావు మార్గదర్శి కార్యాలయం ముట్టడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
చెన్నై: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి తమను మోసం చేస్తోందని ఆరోపిస్తూ వందమందికిపైగా ఖాతాదారులు ఆదివారం ఇక్కడి అన్నానగర్‌లోని మార్గదర్శి బ్రాంచ్ కార్యాలయాన్ని ముట్టడించారు. 'మార్గదర్శి మోసం నశించాలి" అంటూ నినదించారు. చిట్స్ వేసిన తమకు సొమ్ము చెల్లించకుండా కార్యాలయ సిబ్బంది కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ నుంచి నె లనెలా నిక్కచ్చిగా డబ్బు వసూలు చేస్తున్నారని, చీటీ పాడుకుంటే మాత్రం సొమ్ము చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో సిబ్బంది పోలీసులను పిలిపించారు. పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేశారు. తమకు న్యాయం చేయాలని ఆందోళనకారులు పోలీసులను కోరారు.

ఈ వ్యవహారంలో మార్గదర్శి సిబ్బంది మాత్రం భిన్నవాదన వినిపించారు. అన్నానగర్‌కు చెందిన ఓ వ్యక్తి చిట్ వేశాడని, ఒక వాయిదా మాత్రమే చెల్లించి మూడు వాయిదాలు కట్టకుండా మానేయడంతో అతడి పేరును తొలగించామని చెప్పారు. ఆదివారం చిట్ వేలానికి అతడు రావడంతో తాము అనుమతించలేదని తెలిపారు. దీంతో అతడు తన అనుచరులను, బంధువులను తీసుకొచ్చి గొడవకు దిగాడని వాదిస్తున్నారు. పోలీసుల సమక్షంలో వాస్తవాలు తెలియజేయడంతో సమస్య పరిష్కారమైందన్నారు.

English summary
Customers stage dharna in front of Ramoji Rao's Margadarshi branch office in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X