• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ సంస్థలపై మూకుమ్మడి దాడులు చేపడ్తారా?

By Pratap
|

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంస్థలపై వివిధ సంస్థలు సమన్వయంతో మూకుమ్మడి దాడులకు దిగే అవకాశం ఉన్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక వార్తాకరథనం అంచనా వేస్తోంది. వైఎస్ జగన్ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆదాయపు పన్ను శాఖలు ఇప్పటికే కీలక సమాచారాన్ని సేకరించాయని, హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు సీబీఐ కూడా రంగంలోకి దిగిందని, జగన్ అక్రమాస్తుల అభియోగాలపై ప్రాథమిక విచారణ ప్రారంభించిందని ఆ వార్తాకథనం తెలుపుతోంది.

ఆ వార్తాకథనం ప్రకారం - అనేక ఉల్లంఘనలు, అనేక వ్యవస్థలతో ముడిపడిన ఈ 'కేసు'ను పూర్తిస్థాయిలో తవ్వడం ఒక్క సీబీఐతో జరిగేది కాదు. ఈ నేపథ్యంలో ఎక్కడా సమన్వయ లోపం తలెత్తకుండా, దర్యాప్తు సమగ్రంగా సాగేందుకు వీలుగా కీలక విభాగాలతో కలిపి 'మల్టీ డిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్' (ఎండీఐటీ) ఏర్పాటు చేయాలని సీబీఐ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ అవసరాన్ని తెలియజేస్తూ ఎండీఐటీ ఏర్పాటు చేయల్సిందిగా తన ప్రాథమిక నివేదికలోనే రాష్ట్ర హైకోర్టును అభ్యర్థించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. సీబీఐ ఇప్పటికే జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలన్నింటికీ నోటీసులు పంపింది.

ఇప్పటిదాకా జరిగిన పరిశీలన ప్రకారం... జగన్ అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని సీబీఐ ఒక నిర్ధారణకు వచ్చే అవకాశాలే బలంగా ఉన్నాయి. ఒకవేళ కోర్టు అందుకు అనుమతిస్తే... జగన్‌పై వచ్చిన ఆరోపణలన్నిటిపైనా దర్యాప్తు చేసేందుకు ఆయా సంస్థలు రంగంలోకి దిగుతాయి. అయితే, ఇలా వేటికవి దర్యాప్తు చేస్తే సమన్వయ లోపం తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఎండీఐటీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని ఆ దినపత్రిక రాసింది.

జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్‌లో సుమారు 56 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. జగన్‌తోపాటు ఈ కంపెనీలన్నింటికీ ఆదాయపు పన్ను శాఖ ఇదివరకే నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీల్లో పలు సంస్థలు బోగస్ అని, నిధుల ప్రవాహం కోసం జగనే ఏర్పాటు చేశారని, ఇది భారీ కుంభకోణమని ఐటీ శాఖ ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చింది. మరోవైపు... విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన సండూర్ పవర్‌లోకి వచ్చిన విదేశీ పెట్టుబడులను 'సాక్షి'లోకి మళ్లించి 'ఫెమా'ను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు జరుపుతోంది.

అదే సమయంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని తీవ్రస్థాయి మోసాల దర్యాప్తు కార్యాలయాన్ని (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ - ఎస్ఎఫ్ఓ) కూడా రంగంలోకి దించాలని సీబీఐ హైకోర్టును కోరనున్నట్లు తెలిసింది. జగతి పబ్లికేషన్స్, సండూర్ పవర్, సరస్వతి పవర్, భారతి సిమెంట్స్ లిస్టెడ్ కంపెనీలు కాకపోయినప్పటికీ వీటిలో పలు లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడిగా పెట్టాయి. అవి ప్రజలనుంచి పెట్టుబడులు సేకరించినందున ఎస్ఎఫ్‌వోతోపాటు సెబీ కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ భావిస్తోంది.

English summary
According to a news paper report - Central agencies may carried out joint operations on YSR Congress party president YS Jagan's companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X