సీమాంధ్రులు కాదంటే దంచికొడుదాం: కెసిఆర్

ఒక్కటై పిడికిలి బిగిస్తే శత్రువు ముఖం బద్ధలవుతుందన్నారు. ఈ వలసపెత్తందార్లు ఇంకెన్నాళ్లుంటారో అడుగుదామని ఆయన అన్నారు. సింగరేణి బతికి ఉండాలంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చి తీరాలని చెప్పారు. సింగరేణిలో ఉద్యోగుల బదిలీలపై బెంగవద్దని, ఆ విషయమై సంస్థ ఎండీతో తాను మాట్లాడుతానని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. శత్రువు దాడిని చూసి భయపడవద్దని, అలా భయపడి ఉంటే తాను ఎప్పుడో పోయేవాడినన్నారు. ఉద్యమంలో పాల్గొంటున్నపుడు కొంత రాపిడికి గురికాకతప్పదని, 11ఏళ్లుగా ఉద్యమిస్తున్న తనను ఎందరో ఎన్నో తిట్లుతిట్టారని, అనేక నిందలు వేశారని చెప్పారు. ఇదే మరెవరైనా అయితే గుండె పగిలి చచ్చేవారన్నారు. అతి త్వరలోనే మనల్ని మనం పాలించుకునే శక్తి వస్తుందని హామీ ఇచ్చారు.
లక్ష్యం కోసం బయల్దేరామని, గమ్యం చేరాలని, పొరపాటున ఇప్పుడు తెలంగాణ రాకపోతే మన అడ్రస్ మిగలదని ఇక్కడెవరం మిగలమని, ఎవ్వరినీ ఉండనీయరని, మనవి బానిస బతుకులవుతాయనిని కేసీఆర్ హెచ్చరించారు. టీజీ వెంకటేశ్‌ను ఆయన పిచ్చి మంత్రిగా అభివర్ణించారు. ఉద్యమాన్ని ప్రజల కోణంలో చూడాల్సిన మంత్రి ప్రత్యేక సైన్యం అని మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం అన్నదానికి అర్థం లేకుండా పోయిందనిపిస్తోందన్నారు.