వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడేళ్ల పాటు భార్య రక్తాన్ని భర్త తాగాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhya Pradesh
భోపాల్: నిజ జీవితంలో కూడా ఒళ్ళు గగుర్పొడిచే సినిమా సంఘటనలే ! మధ్యప్రదేశ్ లోని దామో జిల్లాలో 22 ఏళ్ళ దీపా అహిర్వార్ అనే యువతి గత మూడేళ్ళుగా భర్త తన రక్తం తాగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిరంజితో రక్తం ఆమె చేతులనుండి తీసుకోవడం, దానిని ఒక గ్లాసులో పోసుకొని తాగడం అతనికి అలవాటైందని ఆమె ఆరోపించింది. ఎవరికైనా ఈ విషయం చెపితే పరిణామం తీవ్రంగా వుంటుందని బెధిరించడం ఈ రాక్షసుడు చేసేపని. దీప షికార్పుర గ్రామంలో 2007లో మహేశ్ అహిర్వార్ అనే వ్యవసాయ కూలీని పెళ్ళి చేసుకొంది. పెళ్ళి అయిన కొద్ది నెలలకు మహేశ్ తన భార్య శరీరంనుండి రక్తం తీసుకొని తాగడం మొదలెట్టాడు. తనకు ఈ చర్య బలాన్నిస్తోందనేవాడు. చివరకు ఆమె గర్భవతి అయినప్పటికి దీనిని కొనసాగించాడు. మూడేళ్ల పాటు ఈ తతంగం నడిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఓ ఆంగ్లపత్రిక రాసింది.

సుమారు ఏడు నెలల క్రిందట ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త చేస్తున్న పైశాచిక చర్యకు తన నిరసన తెలిపింది. వ్యతిరేకించినందుకు ఆమెను కొట్టి హింసించేవాడు. చివరకు ఒక రోజు తన బిడ్డను తీసుకొని పటేరా పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న తన తల్లి దండ్రుల ఇంటికి పారిపోయింది. తండ్రి ఒక రైతు. అతనికి తన కధ మొత్తం వివరించింది. వీరిద్దరూ కలసి పోలీస్ స్టేషన్లో జరిగింది వివరించడంతో పోలీసులు అంతా విన్నారు. అయితే, మహేశ్ వున్న ఏరియా హిందోరియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని ఈ ఫిర్యాదు అక్కడ ఇవ్వాలని వారు తెలిపారు.

హిందోరియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అక్కడి మహిళా కౌన్సెలింగ్ విభాగానికి తెలియపరచాల్సిందిగా వారు కోరారు. చివరకు పరారీలో వున్న నిందితుడు మహేశ్ పై అటు పటేరియా పోలీస్ స్టేషన్ లేదా ఇటు హిందోరియా పోలీసులుగాని కేసు నమోదు చేయలేదు. అయితే, విషయం తెలుసుకొన్న షికార్పుర గ్రామస్తులు దీప పరిస్ధితిని అర్ధం చేసుకుని తామే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గట్టిపట్టు పట్టడంతో, గత్యంతరంలేని హిందోరియా పోలీసులు ఇపుడు మహేశ్ ఆమెను శారీరకంగా హింసించాడంటూ కేసు నమోదు చేసుకున్నారు.

English summary
Earlier this month, Deepa, with the baby in her arms, escaped to her parents' house under the Patera police station area. When she narrated the story to her farmer father, he took her to the local police station to register a case against Mahesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X