హైదరాబాద్: కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్‌కు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు షాక్ ఇచ్చారు. చైనాలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆజాద్‌తో తాము ఎట్టి పరిస్తితుల్లోనూ చర్చలు జరిపే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సోమవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. వారు ఎంపీ మంద జగ్నాథం ఇంట్లో భేటీ అయిన టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై చైనాలో ఆజాద్ చేసిన తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని వరంగల్ ఎంపీ రాజయ్య డిమాండ్ చేశారు. ఆజాద్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే ఆయనతో చర్చలు జరిపే ప్రసక్తి లేదన్నారు. ఆజాద్ సీమాంధ్ర నాయకులకు ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. సీమాంధ్రులకు ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అపాయింటుమెంటు ఇస్తుంటే మేం ఆజాద్‌తో చర్చలు జరపడం ఏమిటని ఆయన అన్నారు.
తెలంగాణ అంశంపై సీమాంధ్రులు గందరగోళాన్ని సృష్టించే పని చేస్తున్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. సీమాంధ్ర ప్రాంతం నుండి ముఖ్యమంత్రులుగా చేసిన చాలామంది పార్టీ అధిష్టానానికి వెన్నుపోటు పొడిచిన వారే అని అన్నారు. ప్రతి సమస్య చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్నారు. అధిష్టానం చర్చలకు పిలిచినప్పుడు వెళ్లవలసి ఉంటుంద్నారు. మా విధానం బలహీనపడే అవకాశం లేదన్నారు. చైనాలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆజాద్ కన్నా పెద్దస్థాయి నేత చర్చలలో పాల్గొంటే తాము ఆజాద్‌తో చర్చించేందుకు సిద్ధమని అన్నారు. అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తుందనే అభిప్రాయాన్ని మరో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Telangana congress MPs gave shock to union minister Ghulam Nabi Azad today. They said that the will not ready to talk with Azad. They demanded to Azad apology on his statement in China.
Story first published: Monday, July 18, 2011, 13:03 [IST]