వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నర్సింహన్ వద్ద టిడిపి నేతల సమైక్యరాగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Narasimhan
విశాఖపట్నం: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వద్ద తెలుగుదేశం విశాఖపట్నం జిల్లా నాయకులు సమైక్యరాగం వినిపించారు. అయ్యన్నపాత్రుడి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు ఓ వినతిపత్రం సమర్పించారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం విశాఖపట్నం వచ్చిన గవర్నర్‌ను వారు కలిశారు. ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వారు ఈ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ నెల 20వ తేదీన సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు గుంటూరులో సమావేశమై సమైక్యాంధ్ర కోసం చేపట్టే ఉద్యమం కోసం వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. తెలంగాణ తెలుగుదేశం నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆందోళనలు సాగిస్తుండగా సీమాంధ్ర నేతలు అందుకు విరుద్ధంగా తమ వ్యూహానికి పదును పెడుతున్నాడు.

కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నర్సింహన్‌ను కలిశారు. నర్సింహన్‌తో ఆయన అరగంట పాటు సమావేశమయ్యారు. మంత్రి బాలరాజు నేతృత్వంలోని కాంగ్రెసు ప్రతినిధులు కూడా గవర్నర్‌ను కలిశారు. వీరిలో ప్రజారాజ్యం పార్టీ నాయకులు కూడా ఉన్నారు. సమైక్యాంధ్ర కోసం వీరు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే, కాంగ్రెసు, ప్రజారాజ్యం శాసనసభ్యులు 8 మంది సోమవారంనాడు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఢిల్లీలో సమైక్యరాగం వినిపించేందుకు వారు వెళ్తున్నారు.

English summary
TDP Vishakapatnam leaders met Governor Narasimhan and urged not to divide state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X