విజయనగర సామ్రాజ్యం నిధినిక్షేపాల కోసం వేట

Vijayanagara Empire
అనంతపురం: కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయం కోశాగారంలో అనంతమైన సంపద బయటపడిన నేపథ్యంలో ఆగంతకులు విజయనగర సామ్రాజ్యం కోశాగారం కోసం వేట ప్రారంభించారు. విజయనగరం సామ్రాజ్యం సిరిసంపదలతో తూలతూగిందని చరిత్ర చెబుతోంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆ సంపదకు లెక్కలేదని అంటారు. దీంతో అనంతపురం జిల్లాలో విజయనగర సామ్రాజ్యం సంపద కోసం గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. బంగారం, ఆభరణాలు, బంగారు నాణేలు, వజ్రాలు ఇతర విలువైన సంపద ఉండవచ్చుననే ఉద్దేశంతో ముఠాలు తవ్వకాలు సాగిస్తున్నాయి. పైగా అత్యంత అధునాతన పరికరాలు, స్కానర్లతో అన్వేషణ సాగిస్తున్నారు.

విజయనగర పాలకులు నిర్మించిన బుక్కపట్నం శివాలయంలోని దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేసిన నలుగురు సభ్యులతో ముఠాను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. విజయనగర చక్రవర్తులకు పెనుకొండ వేసవి కాలంలో రాజధానిగా ఉండేది. దాంతో అక్కడ పెద్ద యెత్తున నిధినిక్షేపాలు ఉండవచ్చునని ఊహించి వాటి కోసం ముఠాలు వేట సాగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పెనుకొండ, గుత్తి, రత్నగిరి, మడకశిర మండలాల్లోని పర్వత ప్రాంతాల్లో విజయనగర పాలకులు కోటలను, భారీ కట్టడాలను నిర్మించారు. వాటిని తవ్వే పనిలో మఠాలు పడ్డాయి.

ముస్లిం పాలకుల నుంచి కాపాడడానికి కర్ణాటకలోని తమ రాజధాని హంపీ నుంచి పెద్ద యెత్తున బంగారు ఆభరణాలను విజయనగర చక్రవర్తులు అనంతపురం జిల్లాలోని పెనుకొండకు ఏనుగులు, గుర్రాలు, ఎడ్ల బండ్లపై తరలించారని చెబుతారు. పెద్ద యెత్తున సంపదను కోటల్లో, గుడుల్లో, స్మారక కట్టడాల్లో దాచి పెట్టారని అంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+