అధిష్టానానికి లగడపాటి 'వైయస్ జగన్ క్లిప్పింగ్స్'

Lagadapati Rajagopal
హైదరాబాద్: ఇటీవల వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన తీవ్ర ఆరోపణలు న్యూఢిల్లీలోని కాంగ్రెసు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. జగన్ పార్టీ వీడి వెళ్లాక చాలా రోజులు మాట్లాడని లగడపాటి గత కొన్ని రోజులుగా జగన్‌పై తీవ్రస్థాయిలో విరిచుకు పడుతున్నారు. విజయవాడలో రెండు సార్లు విలేకరుల సమావేశం నిర్వహించి జగన్‌పై ఫైర్ అయ్యారు. జగన్‌పై విరుచుకు పడ్డ లగడపాటి పత్రికల కటింగ్స్, విజువల్స్ కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ద్వారా కోస్తా కాంగ్రెసులో బలమైన నేతగా ముద్ర పడటమే కాకుండా తన రాజకీయ భవిష్యత్తుకు బాగా ఉపయోగ పడుతుందనే లగడపాటి జగన్‌పై విమర్శలు చేసినట్లుగా పలువురు భావిస్తున్నారు.

లగడపాటి అనుచరులు సైతం రాజకీయ భవిష్యత్తు బాగా ఉంటుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. లగడపాటి, జగన్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో కోస్తా కాంగ్రెసులో కొత్త సమీకరణాలు సైతం వస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సిఫార్సుతో కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకున్న సాయి ప్రతాప్, జగన్ విషయంలో స్పందించడం లేదన్న కారణంతోనే ఆయనకు ఉద్వాసన పలికినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు లగడపాటి తన పంథా మార్చారని పలువురి భావన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+