సీమాంధ్ర నేతల వాదనకు తెలంగాణ వివేక్ కౌంటర్

Vivek
హైదరాబాద్: కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటేనే తీవ్రవాదం పెరుగుతుందని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు వివేక్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కంటే ఉత్తరాంధ్రలోనే తీవ్రవాదం ఎక్కువ ఉన్నదని ఇంటెలిజన్స్ నివేదికలు వెల్లడిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తీవ్రవాదులు ఉన్నారని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. గూర్ఖాలాండుకు, తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గూర్ఖాలాండ్ తరహా ప్రత్యేక ప్రతిపత్తికి అంగీకరించే సమస్యే లేదన్నారు. తెలంగాణ తప్ప మరో ప్రతిపాదన అంగీకరించమని అన్నారు. 1969లో తెలంగాణ ఇవ్వకుంటేనే తీవ్రవాదం తెలంగాణలో ప్రవేశించిందని ఇప్పుడు ఇవ్వకుంటే మళ్లీ తీవ్రవాదం పెరిగే ఆస్కారం ఉందన్నారు.

పార్టీ అధిష్టానం తెలంగాణ ఇవ్వాలా వద్దా అని చర్చలు జరిపితే తాము వెళ్లే ప్రసక్తి లేదని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులకు వచ్చే నష్టమేమీ లేదన్నారు. కేంద్రంతో చర్చలకు అభ్యంతరం లేదని అయితే తెలంగాణ ఇస్తామని చెబితేనే చర్చలకు వెళతామని అన్నారు. సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేస్తే మా అభిప్రాయాలు చెబుతామని అన్నారు. సీమాంధ్రుల అభ్యంతరాలను నివృత్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం చివర దశకు వచ్చిందన్నారు. ఈ నెల 21న ఢిల్లీ వెళ్లే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా మంత్రి జానారెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు భేటీ అయి ఢిల్లీ పర్యటనపై చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+