సత్య సాయి మందిరంలో 34.5 కిలోల బంగారం

వాటితోపాటు పట్టు వస్త్రాలు, గడియారాలు తదితర వస్తువులు ఉన్నట్లు కలెక్టరు తెలిపారు. మిగిలిన గదుల్లోని సంపదను మంగళవారం లెక్కిస్తామన్నారు. ట్రస్టు సభ్యులు పి.ఎన్‌భగవతి, ఇందులాల్‌షా, శ్రీనివాసన్, రత్నాకర్, ఎస్.వి.గిరి, చక్రవర్తి, బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్, ఆర్డీఓ ఈశ్వర్, ప్రత్యేకాధికారి వెంకటేశం, తదితరులు సంపద లెక్కింపులో పాల్గొన్నారు.
సత్యసాయి సేవా ట్రస్టు ప్రభుత్వానికి ఇచ్చిన పత్రాల పరిశీలన వేగంగా జరుగుతోంది. 20వ తేదీ నాటికి వాటిని పూర్తిగా అధ్యయనం చేసి వివరాలను అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యేకంగా నియమించిన కమిటీ సభ్యులు పరిశీలనను వేగవంతం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల మేరకు వివరాలు అందించారా? లేదా? అని చూస్తున్నారు.












Click it and Unblock the Notifications