హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్మాకు రంగం సిద్ధం, సై అన్న ఉద్యోగులు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసు నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాంతిభద్రతలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విధులకు హాజరు కాని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆరునెలల పాటు అన్ని ప్రభుత్వం సేవలు ఎస్మా పరిధిలోకి తీసుకు రావాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఉద్యోగులు ఎవరైనా విదుల్లో పాల్గొనకుంటే వారి స్థానంలో రిటైర్డ్ ఉద్యోగులను తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ప్రత్యేక భద్రత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అత్యవసర సేవలకు అంతరాయం కలగకూడదని ముఖ్యమంత్రి వారిని ఆదేశించారు. ఈ సమీక్షలో వైద్య, విద్య, రవాణా శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. కాగా ప్రభుత్వ ఎస్మా ప్రయోగంపై ఉద్యోగ సంఘాల జెఏసి నేత స్వామిగౌడ్ స్పందించారు. ఎస్మా ప్రయోగించాల్సిన సమయం వస్తే ఉద్యోగులకు ఇచ్చిన మాట తప్పిన మంత్రులపై, ప్రభుత్వంపై ప్రయోగించాలని డిమాండ్ చేశారు. తాము సకల జన సమ్మెకు పూనుకుంటున్నామని తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

ఎంపీ పొన్నం ప్రభాకర్ సైతం కరీంనగర్‌లో మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల సమ్మెకు మద్దతు పలుకుతామని చెప్పారు. ఎస్మా ప్రయోగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగులు విధుల్లో పాల్గొనకుండా చూస్తామని చెప్పారు. పార్లమెంటు ముందు ప్రాణత్యాగం చేసినా సీమాంధ్ర కళ్లు తెరుచుకోవడం లేదా అని ప్రశ్నించారు. వారికి ఇంకా ఎన్ని తెలంగాణ ప్రాణాలు కావాలని ప్రశ్నించారు.

English summary
State government is planned to ESMA on state government employees for six months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X