న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని అయితే రాష్ట్రం విడిపోవడం మాత్రం అసంభవమని పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు బుధవారం న్యూఢిల్లీలో అన్నారు. అన్నదమ్ముల మధ్య బేధాభిప్రాయాలు సహజమే అన్నారు. ముఠాకక్షదారులే కలిసి పోతుంటే ప్రాంతీయ విభేదాలు ఉన్న తాము కలవలేమా అని అన్నారు. ఒకరి విజయం మరొకరి వైఫల్యం కాదన్నారు. అన్నదమ్ముల మధ్య బేధాభిప్రాయాలు సహజం అన్నారు. పరిష్కారం ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. సమస్య త్వరలో పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం విడిపోవడం అసంభవమని అన్నారు.
రాష్ట్రం విడిపోవడం అసంభవమని, ఆ విషయంలో జరుగుతున్నదంతా కొందరి దుష్ప్రచారమని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలను అధిష్టానానికి వివరించామని అన్నారు. ప్రధాని భేటీలో ఇది ఒక రాష్ట్ర సమస్య కాదని దేశం ముక్కలయ్యే ప్రమాదం ఉందని సూచించినట్లు చెప్పారు. విభజనపై ఆవేశాలకు లోనుకాకుండా మూడు ప్రాంతాల వారు బృందాలుగా ఏర్పడి ఉమ్మడి వేదికపై చర్చించాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచించారని చెప్పారు.