జగన్ మహల్: అంచనా విలువ రూ. 300 కోట్లపైనే

రియల్ ఎస్టేట్ వర్గాల కథనం ప్రకారం - భవనం ప్రణాళిక ప్రకారం పలు ఎస్కలేటర్లు, లిఫ్టులు, 200 సీట్ల మినీ థియేటర్, గ్రంథాలయం, జిమ్, స్క్వాష్, టెన్నిస్, వాలీబాల్ కోర్టులు ఉన్నాయి. మూడు అంతస్థుల అండర్ గ్రౌండ్ పార్కు కూడా ఉందని అంటున్నారు. రాజస్థాన్ నుంచి ఓ కాంట్రాక్టర్ ఆ మహల్ కోసం 24 రైలు వ్యాగన్ లోడ్స్ మార్బుల్‌ను తెప్పించాడట. వాటిని 60 గదుల కోసం తెప్పించారని చెబుతున్నారు. భవనం 42 వేల చదరపు అడుగుల మేర పరుచుకుని ఉంటుందని చెబుతున్నారు.
జగన్ అనుబంధ సంస్థలు ఆ స్థలాన్ని కొన్నాయని, మూడు ఆరు ప్లాట్లను తీసుకున్నారని అంటున్నారు. అది లోటస్ పాండ్ ప్రాంతంలో ఉంది. జగన్ పేరు మీద మూడింట రెండు వంతుల ఆస్తి, ఆయన సోదరి షర్మిళా రెడ్డి పేరు మీద మిగతా ఆస్తి ఉందని చెబుతున్నారు. ప్లాట్ మొత్తం ధర కనీసం 30 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. జగన్ మహల్‌లో కార్యాలయ సముదాయంతో పాటు 30 పడక గదులు, 20 సేవకుల క్వార్టర్లు, రెండు అంతస్థుల అవుట్ హౌస్ ఉంటాయని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం లేకపోతే దాని విలువ 700 కోట్ల రూపాయలకు పైగా ఉండేదని, ఇప్పుడు 300 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. దాన్ని స్థానికులు జగన్ మహల్ అని పిలుస్తారు.












Click it and Unblock the Notifications